
ఈ నెల 26న ముంబైలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG: రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగానికి ఊపిరి పోసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం అక్టోబర్ 26వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ అంశాలపై ఈ బృందం చర్చించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.




