ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Nov 07, 2026, 11:11 IST/

పెళ్లి జ‌ర‌గాల్సిన ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Nov 07, 2026, 11:11 IST
TG: హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కీసర మండలం యాద్గారిపల్లి గ్రామానికి చెందిన పుట్ట శ్రీరాములు (48), తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు పుట్ట చిత్తయ్య (65)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మూడు చింతలపల్లి సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీరాములు ఇంట్లో పెళ్లి సంబురాలు జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.