
హైదరాబాద్లో కార్తీక దీపాలు వెలిగిస్తుండగా మహిళ మృతి
TG: హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఆదివారం కార్తీక దీపాలు వెలిగిస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో భానుమతి (64) అనే మహిళ మృతి చెందారు. దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె కట్టుకున్న చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని సోఫాతో పాటు ఇతర గృహోపకరణాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.




