ఇ-ముద్రా (eMudhra) షేర్ల పతనం కొనసాగుతోంది. సంస్థ జారీ చేసిన 8 ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు లీకైనట్లు CERT-In వెల్లడించడంతో గురువారం షేరు 18% పడిపోయి రూ.351.35 వద్ద ట్రేడైంది. రెండు సెషన్లలో 35% క్షీణించింది. గూగుల్, మొజిల్లా ప్రభావిత సర్టిఫికెట్లను బ్లాక్ చేశాయి. అయితే, దేశీయ డిజిటల్ సిగ్నేచర్, ఈ-సైన్ సేవలు సురక్షితంగానే ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.