Top 10 viral news 🔥

నవంబర్ నెలలో శుభ ముహూర్తాలు ఇవే!
నవంబర్ 10వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. శుభకార్యాలకు మంచి ముహూర్తాలు మొదలయ్యాయని పంచాంగకర్తలు పేర్కొన్నారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాల వంటి కార్యక్రమాలకు దాదాపు 17 రోజుల పాటు సుముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. నవంబర్ 12 నుంచి 27 వరకు, డిసెంబర్ 2, 3 తేదీలలో విశిష్ట ముహూర్తాలు ఉన్నాయని వెల్లడించారు. జాతక బలాన్ని బట్టి జ్యోతిష్య పండితుల సలహా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.




