
ఇద్దరిది ఒకే గోత్రం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని జంట ఆత్మహత్య
గుజరాత్లో ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రాజేష్ నినామా (22) అనే యువకుడు, 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాహోద్ జిల్లా లిమ్ఖేడాకు చెందిన వీరిద్దరూ గతంలో ఇల్లు వదిలి వెళ్లిపోగా, ఒకే గోత్రం, ఇంటిపేరు కారణంగా బాలిక కుటుంబం పెళ్లికి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆదివారం హిరాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్రారంభించి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుమారు 50 మంది ఈ లైవ్ను వీక్షించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

































