
విరగకాసిన బొప్పాయి చెట్టు.. అశ్చర్యంలో గ్రామస్తులు
అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. బరగడ దుర్గ ప్రసాద్ - కౌసల్య దంపతుల ఇంటి పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టు విరగకాసి గ్రామస్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదలు నుంచి చివరి వరకు సుమారు 500కు పైగా కాయలతో చెట్టు నిండిపోయింది. సాధారణంగా ఒక చెట్టు 50-60 కాయలు కాస్తుందని కానీ ఇంత భారీ స్థాయిలో కాయలు రావడం ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు అంటున్నారు. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివస్తున్నారు. విద్యావంతులు మాత్రం ఇది మంచి హైబ్రిడ్ వంగడం, సారవంతమైన నేల, సరైన పోషణ, అనుకూల వాతావరణం కలిసి రావడం వల్లే ఈ అద్భుత దిగుబడి సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు.



































