
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చర్ల మండలం చీమలపాడు గ్రామానికి చెందిన ఎల్లబోయిన కామరాజు (47) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చర్ల నుండి తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.





































