Sep 16, 2026, 15:09 IST/
వికసిత్ భారత్ థీమ్తో వినాయక మండపం (VIDEO)
Sep 16, 2026, 15:09 IST
హైదరాబాద్లోని ఉప్పుగూడలో వికసిత్ భారత్ థీమ్తో రోబో రూపంలో గణేశుని ప్రతిమను ఏర్పాటు చేశారు. 2047 తర్వాత భారత్ పరిస్థితులను ఉద్దేశించి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం తయారీకి రూ.4 లక్షలు ఖర్చయింది. గతంలో ఆపరేషన్ సింధూర్, చంద్రయాన్, అయోధ్య రామ మందిరం వంటి థీమ్లలోనూ గణపతిని ప్రతిష్టించారు. ప్రతిరోజూ ఉచిత గణపతి హోమం, పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.