Sep 27, 2026, 15:09 IST/
వన్డేల్లో మరో రికార్డు.. 15వేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ
Sep 27, 2026, 15:09 IST
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 15వేల పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచారు. సచిన్ రికార్డు (377 ఇన్నింగ్సులు)ను బద్దలు కొట్టి 303 ఇన్నింగ్సుల్లోనే పూర్తి చేశారు. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించారు. కాగా కోహ్లీ వన్డేల్లో 54 సెంచరీలు చేశారు. కాగా వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిట (463 ఇన్నింగ్సుల్లో 18426 రన్స్) ఉంది.