ఖమ్మంలో ఎంఆర్‌పీఎస్ సమావేశం

1158చూసినవారు
ఖమ్మంలో ఎంఆర్‌పీఎస్ సమావేశం
ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్‌పీఎస్ ఖమ్మం నగర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్‌పీఎస్ ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, ఖమ్మం నగరంలోని 26 బస్తీల్లో ఎంఆర్‌పీఎస్ నూతన నిర్మాణాలు ఏర్పాటు చేయాలని, ఎంఆర్‌పీఎస్ జెండా దిమ్మెలు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MSP మాజీ అధ్యక్షులు తురుగంటి అంజయ్య మాదిగ, MRPS మాజీ అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, కో ఇంచార్జి బాకీ శ్రీను మాదిగ, సీనియర్ నాయకులు మరికంటి శేఖర్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్