Sep 03, 2026, 16:09 IST/ఖమ్మం
ఖమ్మం
వృద్ధులకు పండ్లు, మెడికల్ కిట్లు పంపిణీ చేసిన వాసవి క్లబ్
Sep 03, 2026, 16:09 IST
ఖమ్మం జిల్లాలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వీక్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం బ్యాంక్ కాలనీలోని సత్యసాయి సేవా మందిరం వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు వి. ఎన్. మారెమళ్ళ రామకృష్ణ నేతృత్వంలో సుమారు 40 మంది వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిక్ట్ ఇన్చార్జి ఎర్రం రామకృష్ణ మెడికల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వల్లాల యుగేందర్, ఐపీసీ సిల్వర్ స్టార్ గెళ్లా కృష్ణారావు, జోన్ చైర్మన్ కొదుమూరి మోహన్రావు, కురువెళ్ల గోపాలకృష్ణమూర్తి, నాళ్ళా భానుచందర్ పాల్గొన్నారు.