Sep 27, 2026, 17:09 IST/పినపాక
పినపాక
పీహెచ్సీ ఎంపీ బంజార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
Sep 27, 2026, 17:09 IST
బూర్గంపాడు మండలంలోని పీహెచ్సీ ఎంపీ బంజార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని వివిధ రికార్డులు, సిబ్బంది డ్యూటీ రోస్టర్ను పరిశీలించి విధుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ తీరును సమీక్షించారు. సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై సమయపాలన పాటించాలని సూచించారు.