Sep 25, 2026, 16:09 IST/ఖమ్మం
ఖమ్మం
ఖమ్మం: కట్టెల మండీలు, టింబర్ డిపోలు నగరం బయటకు తరలించాలి
Sep 25, 2026, 16:09 IST
ఖమ్మం నగరంలోని జనావాసాల మధ్య ఉన్న కట్టెల మండీలు, టింబర్ డిపోలను నగరం వెలుపలికి తరలించాలని అఖిలపక్ష పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. శుక్రవారం శ్రీనివాసనగర్‌లో సీపీఎం త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి డిపోలను తరలించాలని, శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్ల తొలగింపు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.