
CEC జ్ఞానేష్ కుమార్ కు జ్ఞానం కలిగేదెప్పుడో
జ్ఞానేష్ కుమార్ కు జ్ఞానం కల్పించమని ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో సిపిఐ(యం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందించడం జరిగినది. ఈ సందర్బంగా పార్టీ మండల నాయకులు పొన్నం. వెంకటరమణ మాట్లాడుతూ బిజెపి వ్యతిరేక ఓట్లను SIR ద్వారా గంప గుత్తాగా తొలగిస్తూ బిజెపి ఎన్నికలలో గెలవడానికి దొడ్డి దారిన సహకరిస్తున్న CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.




































