Sep 12, 2026, 15:09 IST/
1 నుంచి 30 అంకెలు చెప్పలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్
Sep 12, 2026, 15:09 IST
TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి అర్హయ్ (8)పై అంకెలు చెప్పలేదని ఉపాధ్యాయుడు దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడి వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి ఉపాధ్యాయుల జోక్యంతో.. సదరు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే పిల్లలపై ఇలాంటి శారీరక దాడులు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.