పినపాక - Pinapaka

పోగొట్టుకున్న ఫోన్‌ బాధితుడికి అందజేత

పోగొట్టుకున్న ఫోన్‌ బాధితుడికి అందజేత

బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మనోజ్‌ గత నెలలో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను బూర్గంపాడు పోలీసులు గుర్తించి ఆదివారం బాధితుడికి అందజేశారు. ఎస్సై మేడ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం. మనోజ్‌ ఫోన్‌ పోగొట్టుకున్నట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మొబైల్‌ ట్రాకింగ్‌ సాంకేతికత సాయంతో పోలీసులు దాని ఆచూకీని గుర్తించారు. కరకగూడెంలో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. ఫోన్‌ను తిరిగి అందజేసిన ఎస్సైతోపాటు పోలీసు సిబ్బందికి మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నవారు వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

వీడియోలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పోగొట్టుకున్న ఫోన్‌ బాధితుడికి అందజేత
Oct 18, 2026, 06:10 IST/పినపాక
పినపాక

పోగొట్టుకున్న ఫోన్‌ బాధితుడికి అందజేత

Oct 18, 2026, 06:10 IST