Sep 21, 2026, 11:09 IST/అశ్వారావుపేట
అశ్వారావుపేట
ముష్టిబండ భూ నిర్వాసితులపై అధికారుల సమీక్ష.. పరిహారంపై చర్చ
Sep 21, 2026, 11:09 IST
భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో సీతారామ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణంతో ప్రభావితమవుతున్న ముష్టిబండ గ్రామ రెవెన్యూ భూ నిర్వాసితులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలు, పరిహారం, పునరావాస అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాల్వంచ వెంకట్రావు, ఇరిగేషన్ ఏఈ వంశీకృష్ణ, ఆర్ఐ బిక్షమయ్య, రైతులు పాల్గొన్నారు.