
బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి సాత్విక్ (14) అనే 8వ తరగతి విద్యార్థి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం 5 గంటలకు ఆటలాడిన తరువాత రన్నింగ్ చేసి వచ్చిన సాత్విక్ కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.














