వైరాలో ముళ్లపొదల తొలగింపు

3చూసినవారు
వైరాలో ముళ్లపొదల తొలగింపు
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 19వ వార్డు, కొత్త లాలాపురం నుండి శాంతినగర్ వరకు రహదారి ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, కంపచెట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై స్థానికులు కౌన్సిలర్ చింతనిప్పు సులోచన చలపతిరావుకు ఫిర్యాదు చేశారు. బుధవారం కౌన్సిలర్ స్పందించి, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జేసీబీ సాయంతో ఆ ముళ్లపొదలను తొలగింపజేశారు. కౌన్సిలర్ సత్వర చర్య పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్