Sep 19, 2026, 00:09 IST/
LPG సిలిండర్ల సబ్బిడీకి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి
Sep 19, 2026, 00:09 IST
TG: రాష్ట్ర LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. LPG సిలిండర్లకు సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని వెల్లడించింది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, దీనిని పూర్తి చేయని వారికి ఈ ఏడాది జులై నుంచే సబ్సిడీ జమ నిలిచిపోయిందని పేర్కొంది. సూచనలు, ఫిర్యాదుల కోసం 1906 హెల్ప్ లైన్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించింది.