ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఢిల్లీ-వారణాసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Oct 31, 2026, 10:10 IST/

ఢిల్లీ-వారణాసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Oct 31, 2026, 10:10 IST
ఉత్తరప్రదేశ్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం, అక్టోబర్ 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య నార్తర్న్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఢిల్లీ-వారణాసి ప్రయాణం కేవలం 3.5 గంటల్లోనే పూర్తవుతుంది. విమాన చార్జీల కంటే తక్కువ ధరలకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, ఇది సామాన్యులకు కూడా ఉపయోగకరమని మంత్రి స్పష్టం చేశారు.