తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్న కీరన్ పొలార్డ్

11189చూసినవారు
తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్న కీరన్ పొలార్డ్
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ నమోదు చేసిన 14,890 పరుగుల రికార్డును అధిగమించి, తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ, పొలార్డ్ కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్