భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట కొనసాగుతోంది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. డావన్ కాన్వే(65), రచిన్ రవీంద్ర(37), హెన్రీ(31), డారిల్ మిచెల్(20) పరుగులు చేశారు. భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ 2, సుందర్, కంబోజ్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీమిండియా విజయానికి ఇంకో 5 వికెట్లు కావాలి.