
ఆసిఫాబాద్లో 70వ ధమ్మచక్ర ప్రవర్తన్ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో శుక్రవారం ధమ్మచక్ర ప్రవర్తన్ దినోత్సవ వేడుకల కోసం బాబాపూర్ గ్రామస్థులను ఆహ్వానించారు. ఈ నెల 29న ఆసిఫాబాద్లోని లుంబిని దీక్షాభూమిలో జరగనున్న ఈ వేడుకలకు బాబాపూర్ యూత్ ఫోర్స్ సభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ కమిటీ ఉపాధ్యక్షుడు సీహెచ్. చంద్రయ్య మాట్లాడుతూ, తమ గ్రామం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




































