కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకల సమయంలో విషాదం చోటుచేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన శ్రీవాణి (25) అనే యువతి బతుకమ్మ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీవాణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.