నానూర్ మండలం - Nanoor Mandal

కొమరంభీం జిల్లా
జర్నలిస్టుల హామీలు వెంటనే అమలు చేయాలి: టీయూడబ్ల్యూజే
Sep 26, 2026, 14:09 IST/సిర్పూర్
సిర్పూర్

జర్నలిస్టుల హామీలు వెంటనే అమలు చేయాలి: టీయూడబ్ల్యూజే

Sep 26, 2026, 14:09 IST
కొమరంభీం జిల్లా, సిర్పూర్ లో శనివారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ రహమాన్, ప్రధాన కార్యదర్శి ఎస్. సంపత్‌కుమార్‌లు సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్టులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా మూడో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అక్టోబర్‌ 7న ఆసిఫాబాద్‌లోని ఏ డే గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.