Sep 27, 2026, 01:09 IST/
చనిపోయాడన్నారు.. అంబులెన్స్లో తరలిస్తుండగా లేచి కూర్చున్నాడు!
Sep 27, 2026, 01:09 IST
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చీకటి శంకరయ్య (66)ను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, ఈ నెల 25న ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, స్వగ్రామానికి అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో శంకరయ్య లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తిరిగి వేములవాడలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.