Oct 11, 2026, 04:10 IST/
భారీగా పెరిగిన నిత్యావసర ధరలు.. సామాన్యుడిపై అదనపు భారం
Oct 11, 2026, 04:10 IST
దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో పలు కూరగాయల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,200 నుంచి రూ.2,000కు చేరింది. పెద్ద చిక్కుళ్లు కిలో రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతున్నాయి. వంకాయలు రూ.25 నుంచి రూ.49కు, పచ్చిమిర్చి రూ.35 నుంచి రూ.55కు, దోసకాయలు రూ.17 నుంచి రూ.36కు పెరిగాయి. నిత్యావసరాల ధరలు 5 నుంచి 45 శాతం వరకు పెరగడంతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1,200–1,500 అదనపు భారం పడుతోందని నిపుణుల అంచనా వేస్తున్నారు.