కేటీఆర్‌‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ

12చూసినవారు
కేటీఆర్‌‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ
TG: కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల విచారం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. 'అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కేటీఆర్‌పై ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. నేను నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. కేటీఆర్‌ లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను' అని X వేదికగా ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్