TG: మాజీమంత్రి కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 'కొండా సురేఖ మా సోదరీమణి, వేరే కారణాల వల్ల ఆమెను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాల్సి వచ్చింది' తెలిపారు. అలాగే ఎల్‌నినో గురించి అఖిలపక్షం సమావేశంలో అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామని పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్‌తో నయమవుతుందని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ సమయంలో చాలామంది ప్రాణాలు పోయాయని అన్నారు. ప్రతీదాంట్లో
రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు.