
పినపాక
సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తా: ఎమ్మెల్యే పాయం
మణుగూరులో ఎస్బీటీఈటీని స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దంటూ ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల వద్దకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేరుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.


































