
దమ్మపేటలో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని గాంధీబొమ్మ సెంటర్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక హారతులు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. బతుకమ్మలతో పండుగ శోభ సంతరించుకుంది. ఆడపడుచులు, అల్లుళ్ల రాకతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.




































