Sep 26, 2026, 17:09 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
పుష్కర పనులను వేగవంతం చేయండి: శైలజ రామయ్యర్ ఆదేశం
Sep 26, 2026, 17:09 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన టైర్-2, టైర్-3 అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ, టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అంకిత్ పుష్కర ఘాట్లు, రహదారులు, ఆలయాలు, భక్తుల మౌలిక వసతుల పనుల పురోగతిని వివరించారు.