Oct 06, 2026, 17:10 IST/పినపాక
పినపాక
ఆటో కిరాయి విషయంలో గిరిజనుడిపై దాడికి యత్నం
Oct 06, 2026, 17:10 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో మంగళవారం ఆటో కిరాయి విషయంలో డ్రైవర్ గిరిజనుడిపై దాడికి యత్నించాడు. అతడిని బెదిరించి, కొట్టి డబ్బులు, సెల్ఫోన్ దోచుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.