Oct 05, 2026, 17:10 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
కొత్తగూడెం: KTPS 8వ దశ విస్తరణకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - కొత్వాల
Oct 05, 2026, 17:10 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో KTPS 8వ దశ విస్తరణ ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలోని విద్యుత్ కర్మాగారం KTPS 8వ దశ విస్తరణ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్వంచకు చెందిన రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాలు, వర్తక సంఘం, కుల సంఘాల వారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.