Sep 14, 2026, 13:09 IST/
కడుపునొప్పితో గంటల వ్యవధిలో దంపతుల మృతి
Sep 14, 2026, 13:09 IST
TG: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీ దంపతులు అజయ్ (28), దినేశ్వరి (25) తీవ్రమైన కడుపునొప్పితో గంటల వ్యవధిలో మృతి చెందారు. సోమవారం కూలీ పనులు చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురైన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అజయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దినేశ్వరి మరణించారు. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.