దుమ్ముగూడెం మండలం - Dummugudem Mandal

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అక్టోబర్ 5 కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి: జేఏసీ
Sep 27, 2026, 14:09 IST/అశ్వారావుపేట
అశ్వారావుపేట

అక్టోబర్ 5 కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి: జేఏసీ

Sep 27, 2026, 14:09 IST
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 5న భద్రాద్రి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పాయం సత్యనారాయణ, ఎలకం రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం దమ్మపేటలో కరపత్రాలు విడుదల చేశారు. జీవో ఎంఎస్ నం. 3 స్థానంలో కొత్త జీవోకు చట్టబద్ధత, ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, ఏజెన్సీలోని 29 శాఖల్లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీ భూములను పరిరక్షించాలని, అక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏక నరసింహారావు, విగ్నేష్, టి. మహేష్, తదితరులు పాల్గొన్నారు.