Sep 29, 2026, 17:09 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
పట్టభద్రుల ఓటరు నమోదుకు ఫారం-18: అదనపు కలెక్టర్ సూచన
Sep 29, 2026, 17:09 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానం, గడువును పూర్తిగా అవగాహన చేసుకుని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు ఫారం-18 ద్వారా అవసరమైన వివరాలను సమర్పించాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ పై గెజిటెడ్ అధికారితో అటస్టేట్ చేపించి, ధ్రువీకరించి, ఫారం-18 నింపి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.