Oct 13, 2026, 07:10 IST/ఖమ్మం
ఖమ్మం
జీఎస్టీ కార్యాలయం ముట్టడి.. నాయకుల అరెస్టు
Oct 13, 2026, 07:10 IST
ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జీఎస్టీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులపై దాడులను అరికట్టి, పోలీసుల దమనకాండను నిలిపివేయాలని కోరారు. ధర్నాలో పాల్గొన్న నాయకులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, కార్యదర్శి చింతల రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, కార్యదర్శి బుర్ర మనోజ్ తదితరులు పాల్గొన్నారు