Sep 14, 2026, 17:09 IST/భద్రాచలం
భద్రాచలం
లక్ష్మీనగరం వద్ద ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
Sep 14, 2026, 17:09 IST
భద్రాచలం మండలం లక్ష్మీనగరం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చర్ల వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో మద్ది రాము (40) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువేముల నుంచి వస్తుండగా ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.