
బూర్గంపాడులో రూ. 2.20 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగులో రూ. 2.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగినేని పువ్వులు, రెడ్డిపాలెం, కృష్ణసాగర్, ముసలిమడుగు గ్రామాలకు మరియు ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేంద్ర, డీఈ జీవన్కుమార్, ఏడీ నరసింహారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

































