Sep 17, 2026, 15:09 IST/
లాడ్జిలో ఐడీ కార్డు ట్యాగ్తో భార్యను చంపిన భర్త
Sep 17, 2026, 15:09 IST
బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గౌరిబిదనూరు తాలూకా నాగేరెగెరె గ్రామానికి చెందిన విద్యా (23)ను ఆమె భర్త ఆనంద్ లాడ్జిలో ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో విద్యా రెండు నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె కనిపించడం లేదని ఆనంద్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాజాగా లాడ్జికి తీసుకెళ్లి హత్య చేసి ఆనంద్ పరారయ్యాడు.