
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అన్నదానం
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా గురువారం ఇల్లందు పట్టణంలోని 13వ వార్డులో గల సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో సుమారు 4000 మంది భక్తులకు మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండేల రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా పండగ మహోత్సవ సందర్భంగా ఆనవాయితీగా ఈ అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






















