Oct 09, 2026, 15:10 IST/
నీటి నిల్వ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Oct 09, 2026, 15:10 IST
TG: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శుక్రవారం రెండేళ్ల బాలుడు కౌశిక్ ప్రమాదవశాత్తు నీటి నిల్వ గుంతలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, ఆడుకుంటూ వెళ్లిన బాలుడు పొలంలోని నీటి గుంతలో పడిపోయాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు కనిపించకపోవడంతో వెతకగా, నీటి గుంతలో విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.