కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గురువారం తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఎటువంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవద్దని బోర్డు స్పష్టం చేసింది. కేవలం ప్రాజెక్టులను నిర్మించుకున్నంత మాత్రాన నీటి వాటాలపై హక్కులు లేదా అధికారాలు రావు అని కృష్ణా బోర్డు తన లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ లేఖ ద్వారా రెండు రాష్ట్రాలకు సూచించింది.