నేడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం

43చూసినవారు
నేడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం
AP: కృష్ణా నదీ జలాల వినియోగంపై నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ నెల 25 నుంచి మరో మూడు నెలల పాటు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కమిటీకి విజ్ఞప్తి చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా ఖరారుపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్