
రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
పీఎం కిసాన్ 24వ విడత నిధులు రేపు(శుక్రవారం) కేంద్రం విడుదల చేయనుంది. ఈ పథకం కింద కేంద్రం రూ.2 వేల చొప్పున ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 24వ విడత ద్వారా 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నగదు జమ కానున్నాయి.




