
ఇన్నోడేటాలో భారీ లేఆఫ్‌లు.. 550 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ అమెరికన్ ఏఐ డేటా సొల్యూషన్స్ సంస్థ అక్టోబర్ 26 నాడు 'ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' భారీ లేఆఫ్‌లకు పాల్పడింది. కొత్త బిజినెస్ అసైన్మెంట్లు తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఆ రోజు ఆకస్మికంగా తమ లాగిన్ యాక్సెస్‌ను కోల్పోయిన సుమారు 550 మంది ఉద్యోగులకు కంపెనీ ఈమెయిల్ ద్వారా తొలగింపు సమాచారాన్ని పంపింది. భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్ శాఖలో కూడా ఈ తొలగింపులు జరిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది.




