
భీకర దాడులు.. 1,100 టన్నుల పేలుడు పదార్థాలతో అటాక్ (వీడియో)
దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులు చేసింది. అలీ-అల్ తాహెర్ రిడ్జ్లోని భూగర్భ స్థావరాలు, టన్నెల్స్ను లక్ష్యంగా చేసుకుని 1,100 టన్నుల పేలుడు పదార్థాలతో దాడి జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా ఆకాశంలో అగ్నిగోళం ఏర్పడినట్లు కనిపించింది. ఇదే సమయంలో దక్షిణ లెబనాన్లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భారీ పేలుడు వల్లే భూమి కంపించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.




